Sunday, 4 November 2012

మనసు కి మనసుకు మధ్య పరదా!

మనసు కి మనసుకు మధ్య పరదా! మనిషికి మనిషికి మధ్య పరదా! ఒకటికొకటి కనపడనీయని దట్టమైన తెర! ఒకరికొకరు కనపడతున్నా పేరుకున్న పొర! చిక్కటి చీకటి పేర్చే దూరం ఒకటైతే, చీల్చి దూరాలుపెంచే అహం ఒకటి! నన్ను, నేను, నాది, నాకు.. స్వార్థం! నిన్ను, నువ్వు, నీకు, నీది..దూరం! మనం, మనకు, మనది ..సంగమం! మొదటిది అహం, రెండోది ఇహం.. ముచ్చటైన, ముఖ్యమైన మూడోది పరం! ఆ మూడోదానికే జ్ఞాని ఆరాటం! వినడానికి నచ్చిన సత్యం ఆచరణకు కష్టం! బంధాలు ఆనందాలు కావు బంధనాలు.. అన్న వాస్తవం గ్రహించేలోపు ఆవిరయ్యే జీవితం! అద్దంలో బింబంలా.. క్షణికమైన, అందమైన.. బ్రతుకుని చూసి ఆనందపడిపోకు నేస్తం! కాలం పేరిట కలిసొచ్చిన జన్మను సార్థకం చేసుకో!

No comments: